శ్రీకాకుళం జిల్లాలో నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు.
పలాస-కాశీబుగ్గలో..
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేశారు. అందుకోసం 500 మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను.. మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, తాహసిల్దార్ మధుసూదన్, ఎంపీడీవో రమేష్ నాయుడు పర్యవేక్షించారు.
ఇచ్చాపురంలో..
ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. 23 వార్డులకు గాను 36 కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.
పాలకొండలో..
పాలకొండ నగర పంచాయతీ పోలింగుకు ఏర్పట్లను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించి.. పలు సూచనలు, సలహాలు చేశారు. 18వ వార్డు పరిధిలో 19 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నట్లు చక్రవర్తి వివరించారు. ఇప్పటికే 90 శాతం ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: