శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జనవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేదానికి అధికారులు నడుం బిగించారు. ఎవరైనా ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని మండల అధికారులు దండోరా వేయించారు. గత కొద్ది రోజులుగా అధికారులతో పాటు మేమున్నాం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని మండల పంచాయతీ విస్తరణాధికారి ఎస్.వసంత కుమారి తెలిపారు. మండల కేంద్రంలో అందరం కలిసికట్టుగా ప్లాస్టిక్ నిషేధానికి పనిచేస్తున్నామని.. మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పి.సాయిరాం తెలిపారు.
నేటి నుంచి రణస్థలం మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జనవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు నడుం బిగించారు. ప్లాస్టిక్ నిషేధానికి మండల అధికారులతో పాటు మేమున్నాం అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గత కొద్ది రోజులుగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
నేటి నుంచి రణస్థలం మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం
TAGGED:
plastic ban rally at echerla