శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఎక్కువ ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. దాదాపు 4 నెలలపాటు పడ్డ కష్టానికి తగ్గట్లు మంచి దిగుబడి వచ్చింది. ఎకరానికి 30 నుంచి 35 బస్తాల ధాన్యం పండింది. అయితే కోతల సమయంలోనే వచ్చిన కరోనాతో లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు. దీంతో అన్నదాతల ఆశలు అడియాసలు అయ్యాయి. ఒకపక్క వ్యాపారులు రాక.. మరోపక్క ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సరైన సమయానికి తెరుచుకోక ఇబ్బందులు పడ్డామని రైతులు తెలిపారు. వచ్చిన ఒకరిద్దరు వ్యాపారులకు వారు అడిగిన ధరకు అమ్మి నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తమవద్ద పంట లేదని వాపోయారు. ఒక్కొక్క బస్తాకు సుమారు 400 రూపాయల వరకు నష్టపోయామని చెప్పారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
పంట బాగా పండింది.. అయినా నష్టాలే!
ఉత్సాహంగా పంటవేశారు.. రాత్రనక, పగలనక కాయకష్టం చేసి పంట పండించారు.. వాతావరణం అనుకూలించింది.. దానికి తగ్గట్లు మంచి దిగుబడి వచ్చింది.. ఇంకేముంది తమ ఆర్థిక కష్టాలు తీరతాయని ఆశ పడ్డారు అన్నదాతలు.. అయితే వారి ఆనందానికి అడ్డుకట్ట వేస్తూ కరోనా రక్కసి నేనున్నానంటూ వచ్చేసింది. వారి కలల్ని కూల్చేసింది.
కరోనాతో రైతుల కష్టాలు