ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువధ కేంద్రాలపై అధికారుల దాడులు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పశువధ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా పశువధ కేంద్రాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని జిల్లా ఫుడ్ ఇన్​స్పెక్టర్​ కూర్మ నాయకులు నిర్వహకులను హెచ్చరించారు.

By

Published : Nov 18, 2020, 11:21 AM IST

Officers' raids on slaughterhouses at narsannapeta
పశువధ కేంద్రాలపై అధికారుల దాడులు

పశువధ కేంద్రాలపై అధికారుల దాడులు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నడిబొడ్డున పశువధ కేంద్రం నిర్వహణను అధికారులు గుర్తించారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పచౌరి కాలనీలో రెండు పశువధ కేంద్రాలపై మంగళవారం సాయంత్రం అధికారులు దాడి చేశారు. అప్పటికే ఈ రెండు కేంద్రాలు మూసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులను పిలిపించి హెచ్చరికలు చేశారు. ఈ కేంద్రాలు చెరువును ఆక్రమించుకొని నిర్మించడం గమనార్హం.

పశువధ కేంద్రాలపై అధికారుల దాడులు

పశువధ కేంద్రాలను వారంలో నాలుగు రోజుల పాటు తెరిచి పశువులను హతమార్చి మాంసాన్ని విక్రయిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అనుమతులు లేకుండా పశువధ కేంద్రాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని జిల్లా ఫుడ్ ఇన్​స్పెక్టర్​ కూర్మ నాయకులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details