శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పిఆర్ఎస్ఎన్ రెడ్డి ఆమదాలవలస పోలీస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లనూ సందర్శిస్తానని తెలిపారు. జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యాక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. విద్యా సంవత్సర మెుదలైన సందర్భంగా కళాశాలల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యాంటీ ర్యాగింగ్ ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారనీ, బాధితులు తమ ఫిర్యాదులు అందులో వేస్తే వెంటనే స్పందిస్తామని అన్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులవ్వకుండా అవగాహన సదస్సులతో పాటు క్రీడలు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మందస వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యాక్రమంలో ఎస్సై ప్రభావతి కూడా పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీగా ఎన్పిఆర్ఎస్ఎన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ - srikakulam
యువత మావోయిస్టుల్లో చేరకుండా చూడటం తన ముందున్న బాధ్యతగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎన్పిఆర్ఎస్ఎన్ రెడ్డి అన్నారు.
జిల్లాలో ర్యాగింగ్ పై దృష్టి పెట్టాం