నివర్ తుపాను తాకిడి శ్రీకాకుళం జిల్లాకు కూడా ఉండవచ్చునని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోత దశలో ఉన్న వరి పంటను రైతులు కాపాడుకోవాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు శ్రీధర్ కోరారు. ఈ రెండు రోజులపాటు వరి కోతలు నిలుపుదల చేయాలని సూచించారు. ఒక వేళ వరి పంట తుపాను ముప్పునకు దెబ్బతింటే..ఉప్పు ద్రావకాన్ని పిచికారి చేయాలన్నారు.
'నివర్ ముప్పు ఉండొచ్చు...అప్రమత్తంగా ఉండండి' - నివర్ తుపాను తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాకు కూడా నివర్ తుపాను తాకిడి ఉండవచ్చని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోత దశలో ఉన్న వరి పంటను కాపాడుకోవాలని రైతులకు సూచించారు.
'నివర్ ముప్పు ఉండొచ్చు...అప్రమత్తంగా ఉండండి'