ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం 10నెలలుగా అవస్థలు పడుతున్న నరసన్నపేట జనం

Narasannapet Roads : శ్రీకాకుళం జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. రహదారి విస్తరణ ప్రారంభించి 10 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో తమ దుకాణాలను ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

narsannpet_road_winding
narsannpet_road_winding

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 10:07 PM IST

Narasannapet Roads : శ్రీకాకుళం జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంపై నర్సన్నపేట సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్.. రహదారి విస్తరణ కోసం రూ. 10 కోట్లు కేటాయించి 10 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు విస్తరణ పేరుతో తమ దుకాణాలను ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు పడగొట్టినా.. విస్తరణను మాత్రం అటకెక్కించారని విమర్శిస్తున్నారు.

Injustice to Farmers: "సాగు భూమికి.. సరైన ధర ఇవ్వండి సారు..".. నెల్లూరులో భూ సేకరణలో రైతులకు అన్యాయం

'నర్సన్నపేటలో సెంట్రల్ లైటింగ్ కోసం 10కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అందుకోసం రూ.10కోట్లు మంజూరు చేస్తున్నాం.'

రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం 10నెలలుగా పడకేసిన పనులతో అవస్థలు పడుతున్న నర్సన్నపేట జనం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఇది. సత్యవరం నుంచి జమ్ము కూడలి వరకు ఉన్న ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్, రెండు వరుసల విస్తరణను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, పనులు మాత్రం అసంపూర్తిగా మిగిలిపోయాయి.

రోడ్డు విస్తరణ కోసం మూడేళ్ల క్రితం స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా ఉన్న సమయంలో పనులు ప్రారంభించారు. రూ.4.5 కోట్ల పనులు పూర్తయ్యేసరికి నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చుట్టుపక్కల అనేక ప్రాంతాల ప్రజలు విద్య, వైద్యం, వాణిజ్య అవసరాల కోసం నరసన్నపేటకు వేలాదిగా వస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య అధికమై ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. విస్తరణ పేరుతో రోడ్డు పక్కన దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను పడగొట్టడంతో ఉపాధి కోల్పోయామని వ్యాపారస్తులు వాపోతున్నారు.

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు.. ప్రజలకు ఇబ్బందులు

నర్సన్నపేటలో 4.25కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. మిగతా నిధులు ఎక్కడికిపోయాయో తెలియదు. రాత్రికి రాత్రి మార్కింగ్ చేసి భవనాలు పడగొట్టిన అధికారులు.. దాదాపు ఏడాది కావస్తున్నా స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్లు బాగుపడుతాయని ఆశించినా పనులు నిలిచిపోవడం తీవ్ర అసౌకర్యంగా ఉండని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం హామీ ఇచ్చిన పనులు నిలిచిపోవడం విచారకరమని పేర్కొంటున్నారు. స్వయానా సీఎం జగన్‌ ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలా అని మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి నర్సన్నపేట రావడం, వెంటనే ఆయన దృష్టిలో పెట్టడం.. రూ.10కోట్లు కేటాయిస్తున్నామని చెప్పడం.. ఆ వెంటనే భవనాలు పడగొట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. కేవలం కమీషన్లు తప్ప.. ఎక్కడా కూడా లైటు వెలగడం లేదు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు.. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. - రమణమూర్తి, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే

Guntur Road Widening Works: దశాబ్దాలుగా ఎదురు చూసినా పూర్తి కానీ రోడ్ల విస్తరణ.. తీవ్ర ఇబ్బందులలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details