ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే ఉనికి, ఉపాధికి నష్టం: రామ్మోహన్​నాయుడు - ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వార్తలు

కొత్త జిల్లాల ఏర్పాటులో శ్రీకాకుళాన్ని చేర్చొద్దని ఎంపీ రామ్మోహన్​నాయుడు డిమాండ్ చేశారు. విభజన జరిగితే కలిగే నష్టాన్ని వివరిస్తూ వీడియో విడుదల చేశారు.

mp rammohannaidu on new districts
mp rammohannaidu on new districts

By

Published : Nov 8, 2020, 7:59 PM IST

25 పార్లమెంట్‌ స్థానాలకు 25 జిల్లాలు అసంబద్ధ ఆలోచన అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయ కారణాలతో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అవసరమైన చోట మాత్రమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే ఉనికి, ఉపాధికీ నష్టమని వ్యాఖ్యానించారు. 2026లో పునర్విభజనతో పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఏం చేస్తారు? అని రామ్మోహన్​నాయుడు ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే ఉనికి, ఉపాధికి నష్టం: రామ్మోహన్​నాయుడు

ABOUT THE AUTHOR

...view details