ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాబాయ్​ని అరెస్టు చేసింది ఏసీబీనా?... గూండాలా?' - అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆదిరెడ్డి భవానీ స్పందన

అచ్చెన్నాయుడు అరెస్టును ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తీవ్రంగా ఖండించారు. బాబాయ్​ని స‌భ‌లో ఎదుర్కొనే స‌త్తా వైకాపా 151 ఎమ్మెల్యేల‌కూ లేదా అని ప్రశ్నించారు.

Mp Rammohannaidu, mla aadireddy bhavani condemn atchennaidu arrest
Mp Rammohannaidu, mla aadireddy bhavani condemn atchennaidu arrest

By

Published : Jun 12, 2020, 1:10 PM IST

మీడియాతో ఎంపీ రామ్మోహన్

అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది ఏసీబీనా ‌లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలా అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే నిలువెత్తు ప్రజల ధైర్యం తన బాబాయ్​ అచ్చెన్నాయుడు అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవ‌స్థలో బాధ్యతాయుత‌మైన ప్రతిప‌క్ష పాత్ర పోషించ‌డమే బాబాయ్ చేసిన త‌ప్పా అని ఆయన నిలదీశారు. అణ‌చివేత‌కు గురైన బీసీ వ‌ర్గాల గొంతుక‌గా త‌న గ‌ళాన్ని వినిపిస్తున్న అచ్చెన్నను స‌భ‌లో ఎదుర్కొనే స‌త్తా వైకాపా 151 ఎమ్మెల్యేల‌కూ లేదా అని ప్రశ్నించారు. టీడీఎల్పీ ఉప‌నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేట‌ప్పుడు క‌నీసం చ‌ట్టబ‌ద్ధంగా వ్యహ‌రించ‌డ‌మైనా చేత‌కాదా అని మండిపడ్డారు. బీసీ నేత‌ల‌కిచ్చే గౌర‌వం ఇదేనా అని ప్రశ్నించారు.

  • దుర్మార్గమైన చర్య
    తన బాబాయ్ అచ్చెన్నాయుడు అరెస్టు దుర్మార్గమైన చర్య అని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. పేద, బలహీన వర్గాలకు అండగా నిలిచి బలమైన నాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని అణగదొక్కాలని చూస్తున్నారని చెప్పారు. శాసన సభ సమావేశాలు సమీపిస్తున్న సమయంలో ఎక్కాడా ఆయన మాట్లాడకూదని, తెదేపా వర్గాల్లో ఆందోళన కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. శస్త్ర చికిత్స చేసుకున్న వ్యక్తి ఇంటికి రెండు వందల మంది వచ్చి ఇలా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆదిరెడ్డి భవానీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details