ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం' - రామ్మోహన్ నాయుడు తాజా వార్తలు

గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. సీఎం జగన్ పాలన నిరుపేదల నడ్డివిరిచే విధంగా సాగుతోందని ఎద్దేవా చేశారు.

గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం
గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం

By

Published : Mar 8, 2021, 4:38 PM IST

సీఎం జగన్ పాలన నిరుపేదల నడ్డివిరిచే విధంగా సాగుతోందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో తెదేపా అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఆయన..గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో తెదేపా ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులకు ఓట్లేసి..అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details