క్రీడా రంగానికి ప్రాధాన్యత: మంత్రి ధర్మాన - 6th senior inter district soft ball championship
క్రీడా స్ఫూర్తి ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లభించారని మంత్రి ధర్మాన అన్నారు. గ్రామ, మండల స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలనేదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో క్రీడల అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రసాయ్థి 6వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ను కృష్ణదాస్ ప్రారంభించారు. సాఫ్ట్ బాల్ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. క్రీడా పతాకాన్ని ఎగురవేసిన మంత్రి... క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. సరదాగా కాసేపు సాఫ్ట్బాల్ ఆడారు. క్రీడలకు, క్రీడాకారులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనుందని చెప్పారు. గత ప్రభుత్వం కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వదలివేసిందన్న మంత్రి... ఆ పనులను పూర్తి చేస్తామని క్రీడాకారులకు భరోసా ఇచ్చారు. అలాగే గ్రామ, మండలస్థాయిలో క్రీడలను ప్రొత్సహించాలనేదే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమన్నారు.