వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా.. వేడుకలు నిర్వహించే చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందిన విగ్రహాలనే ప్రతిష్టింపజేస్తుంటారు. ఈ కారణంతోనే.. ఇలాంటి విగ్రహాలను తయారీదారులు ఎక్కువగా రూపొందిస్తుంటారు. కానీ.. మాకు డిమాండ్ తో సంబంధం లేదు.. డబ్బులపై ఆశ లేదు అని వీళ్లు ప్రత్యేకత చాటుకుంటున్నారు. కోల్ కతా నుంచి శ్రీకాకుళానికి ఏటా వచ్చి వినాయక ప్రతిమలు తయారు చేసే వీళ్లు.. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని ప్రతిమలు రూపొందిస్తున్నారు. మట్టితో పాటు.. ప్రత్యేకంగా సేకరించిన గడ్డి, సహజ రంగులు వినియోగించడం వీరి ప్రత్యేకత. ఇలా తయారు చేసిన వాటిని ఏటా పాలకొండ పట్టణంలో విక్రయిస్తారు. ఈ సారీ.. 2 నెలల ముందే ఈ దిశగా తయారీని మొదలుపెట్టారు.
మట్టి విగ్రహాల తయారీ కోసం.. అక్కడి నుంచి ఇక్కడికి! - ప్లాస్టర్ ఆఫ్ పారిస్
వినాయక చవితి వచ్చేస్తోంది. విగ్రహాల తయారీదారులు 2 నెలల ముందు నుంచే ప్రతిమలు రూపొందించేస్తున్నారు. చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే విగ్రహాలు రూపొందిస్తున్నా.. కోల్ కతా నుంచి శ్రీకాకుళానికి వచ్చిన వీళ్లు మాత్రం.. ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రకృతిపై ప్రేమను పంచుతున్నారు.
మట్టి వినాయక ప్రతిమలు తయారు చేస్తోన్న కలకత్తా కళాకారులు