ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ - icchapuram latest news

వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో కాశిబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి గురువారం ఇచ్చాపురంలో సమావేశమయ్యారు. అంతర్వేదీలో జరిగిన ఘటనలు మరెక్కడా జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

kasibugga dsp meeting with ecclesiastics
కాశిబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి

By

Published : Sep 24, 2020, 10:47 PM IST

ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో కాశిబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో జరిగిన ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుడాదని స్పష్టం చేశారు. మతపరమైన విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు, మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇచ్చాపురంలో ప్రసిద్ధి చెందిన శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details