ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను చంపి.. ఆపై లారీకి ఎదురెళ్లి..

కుటుంబ కలహాలు రెండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడిన తగాదా కాస్త భార్య ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకునేలా చేసింది.

husband murdered wife  and  after he sucide in srikakulam
husband murdered wife and after he sucide in srikakulam

By

Published : Aug 1, 2020, 6:37 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు మెుదటి భార్య ఏడాది కిందట మృతి చెందింది. దీనితో విజయనగరం జిల్లాకు చెందిన అక్కమ్మను ఈ ఏడాది జులై 12న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే తల్లి ఇంటి నుంచి భర్త వద్దకు వచ్చింది అక్కమ్మ. అయితే భార్యాభర్తల మధ్య గొడవ జరగడం వల్ల అక్కమ్మ తలపై గడ్డపారతో కొట్టి చంపాడు వెంకటరావు. అదే ఆవేశంలో బైక్​పై పైడి బీమవరం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ వైపు దూసుకెళ్లాడు. లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details