ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం.. విద్యుత్​ సరఫరాకు అంతరాయం

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల హై టెన్షన్ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.​​

నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం
నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం

By

Published : Apr 27, 2020, 10:57 PM IST

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో విద్యుత్​ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల స్తంభాలు నేలకొరిగాయి.

సిక్కోలులో భారీగా వాన

శ్రీకాకుళం జిల్లా రాజాం, ఆమదాలవలసలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో తేలికపాటి వాన పడింది. ఆమదాలవలసలో ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని సరుబుజ్జిలి, బూర్జ, పాలకొండ, సీతంపేట, వజ్రపుకొత్తూరు, వీరఘట్టం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.

నెల్లూరులో కూలిన హై టెన్షన్​ విద్యుత్​ స్తంభాలు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. బాలాయపల్లి మండలం పిగిలాము, జార్లపాడు మధ్య హై టెన్షన్​ విద్యుత్​ స్తంభాలు రెండు చోట్ల కూలిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇదీ చూడండి:

మచిలీపట్నంలో అకాల వర్షం... భారీగా పంట నష్టం

ABOUT THE AUTHOR

...view details