ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండ్ల గోదాములపై అధికారులు దాడులు.. కేసులు నమోదు

అరటిపండ్లు మగ్గబెట్టేందుకు విషపూరితమైన రసాయనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు గోదాములపై దాడులు చేసిన అధికారులు... ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.

పుడ్ అండ్ సేప్టీ అధికారులు

By

Published : May 27, 2019, 5:41 PM IST

శ్రీకాకుళం జిల్లా పుడ్ అండ్ సేప్టీ అధికారులు

శ్రీకాకుళం జిల్లా రాజాంలో అరటి పండ్లు నిల్వ చేసే గోదాములపై జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా పుడ్ ఇన్​స్పెక్టర్​ ఈశ్వరితో పాటు రాజాం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ ఈ సోదాల్లో పాల్గొన్నారు. సీతాలక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న మూడు గోదాములను సీజ్ చేసి.... నిల్వ చేసిన 150 అరటి పండ్ల గెలలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మగ్గబెట్టేందుకు విషపూరితమైన రసాయనాలను వాడుతున్నట్లు వారు గుర్తించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి..శాంపిల్స్ సేకరించి నాచారంలోని పుడ్ అండ్ కంట్రోల్ ల్యాబ్​కు పరీక్ష నిమిత్తం పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా పుడ్ కంట్రోల్ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details