ఆధార్ నమోదుతో పాటు నవీకరణ కోసం శ్రీకాకుళం వాసులు నానా కష్టాలు పడుతున్నారంటూ...ఈటీవీ-ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి తీసుకురావటంతో...కలెక్టర్ నివాస్ స్పందించారు. సెప్టెంబరు 15 వరకు ఈకేవైసీ నమోదుకు గడువు పెంచునున్నామని స్పష్టం చేశారు. కొత్తగా 27 ఆధార్ కేంద్రాలకు ప్రతిపాదించామని చెప్పారు. ఆదివారం పోస్టు ఆఫీసు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది ఈకేవైసీతో అనుసంధానం కావల్సి ఉందన్న కలెక్టర్... చౌకధరల దుకాణాలు, మీ సేవ కేంద్రాల వద్ద ఈకేవైసీని నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 15 వరకు ఈకేవైసీ నమోదుకు గడువు: కలెక్టర్ నివాస్ - ఈకేవైసీ
సెప్టెంబర్ 15 వరకు ఈకేవైసీ నమోదుకు గడువు పెంచామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పోస్టు ఆఫీసు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్