శ్రీకాకుళం జిల్లా పాలకొండ పంచాయతీరాజ్ పరిధిలోని సిరికొండ, తుమ్మల గ్రామాల మీదుగా 3కోట్ల 90 లక్షలతో నిర్మించిన రహదారిని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. పాలకొండ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 250 జనాభా దాటిన గ్రామాలకు 4234 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో పాడైన తమ శాఖ పరిధిలో రహదారులకు 150 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రెండేళ్లలో రహదారులు లేని గ్రామాలకు మంచి రహదారులు వేస్తామని తెలిపారు.
రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రహదారులు - srikakulam
మరో రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇంజనీర్ ఇన్ చీఫ్