ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో జగనన్న నినాదం మారు మ్రోగుతోంది' - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్​తో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఎన్నికల్లో ఎక్కడ వెళ్లినా జగనన్న నినాదంతో ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు.

deputy cm narayana swamy lauded cm jagan
ఉపముఖ్యమంత్రులు

By

Published : Mar 3, 2021, 11:13 AM IST

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లినా జగనన్న నినాదంతో వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఉపముఖ్యమంత్రులు నారాయణస్వామి, ధర్మాన కృష్ణదాస్‌ దర్శించుకున్నారు.

డిప్యూటీ సీఎంలకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ విశిష్టతను ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి జిల్లాను ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details