వంశధార ట్రైబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తీర్పు నేపథ్యంలో సీఎం కార్యాలయ అధికారులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఏపీ, ఒడిశా... ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.
Vamshadhara: సుదీర్ఘకాలం తర్వాత సమస్యకు పరిష్కారం: జగన్
వంశధార ట్రైబ్యునల్ తీర్పు పట్ల సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయ అధికారులతో సమావేశమైన జగన్.. నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
సుదీర్ఘకాలం తర్వాత సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలి. నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలి. ఈలోపు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ట్రైబ్యునల్ తీర్పు ఏపీకే కాకుండా ఒడిశాకూ ప్రయోజనకరం. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకు మంచి జరుగుతుంది. బ్యారేజ్ శంకుస్థాపనకు ఒడిశా సీఎంతోపాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తాం. పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నదే మా విధానం.-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండీ... YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్