రాష్ట్రంలో పారిశుద్ధ్య కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై కార్మికులను మోసం చేస్తోందని జిల్లా అధ్యక్షుడు ఆర్. సురేష్ బాబు మండిపడ్డారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు.. గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిల్లా కార్యదర్శి చలపతిరావు తదితరులు ఉన్నారు.
'కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి' - నరసన్నపేటలో సీఐటీయూ నిరసన వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు.. ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని జిల్లా అధ్యక్షుడు ఆర్. సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరసన్నపేటలో సీఐటీయూ ఆందోళన