ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత పట్నంలోని బ్యాంకుల ముందు క్యూ కట్టిన ప్రజలు - పాతపట్నం బ్యాంకుల ముందు బారులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బ్యాంకుల వద్ద ఖాతాదారులు క్యూ కట్టారు. అధిక సంఖ్యలో జనం రావడంతో తోపులాట జరిగింది. ప్రజలు కరోనా వ్యాప్తిని పట్టించుకోకుండా గుంపులుగా, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

bank rush in patnam
bank rush in patnam

By

Published : Jun 16, 2020, 12:38 PM IST

శ్రీకాకుళం జిల్లా.. పాతపట్నం మండల కేంద్రంలోని బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో గత రెండు రోజులుగా అధిక సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుల వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎస్​బీఐ బ్యాంకు వద్ద తోపులాట జరిగింది. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో పోలీసుల సంరక్షణలో టోకెన్ల పద్దతిలో బ్యాంకు లోపలికి పంపించారు. పాతపట్నంతో పాటు.. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ఖాతాదారులు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు.

ABOUT THE AUTHOR

...view details