ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులు ధరించాలని పాలకొండలో అవగాహన కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మాస్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ సిబ్బంది , నగర పంచాయతీ సిబ్బంది కలిసి మాస్కులు లేకుండా బయటకు వచ్చినవారికి అపరాధ రుసుము విధించారు.

awareness programme on masks in sirkakulam dst palakonda
awareness programme on masks in sirkakulam dst palakonda

By

Published : Jun 17, 2020, 5:21 PM IST

మాస్కులు ధరించాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో కార్గిల్ పాయింట్ , కోటదుర్గ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్ , యాలామ్ జంక్షన్​లో ప్రజలకు అవగాహన కల్పించారు. నగర పంచాయతీ కమిషనర్ శ్రీ లిల్లీ పుష్పనాధం, ఎస్​ఐ జనార్ధన్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది కలసి తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి 100 అపరాధ రుసుము విధిస్తూ 3 మాస్కులను అందించారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించి బయటకు రావాలని, లేకపోతే జరిమానా విధిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details