బ్లీచింగ్ పౌడర్ అడిగినందుకు గ్రామ వాలంటీరు దుర్భాషలాడి తమను పోలీసులతో కొట్టించారని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బజారు వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీరు తీరును నిరసిస్తూ రహదారిపై ఆందోళనకు దిగారు. కరోనా వ్యాధి వ్యాప్తి భయంతో తమ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లాలని కోరితే వాలంటీరు పట్టించుకోలేదని అన్నారు. గట్టిగా నిలదీస్తే.. దురుసుగా మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారని గ్రామస్థులు వాపోయారు. పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఈ వాలంటీరు వద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.
వాలంటీరు తీరుపై గ్రామస్థుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బజారు వీధి గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని గ్రామ వాలంటీర్ను అడిగినా పట్టించుకోలేదని వాపోయారు. గట్టిగా అడిగితే పోలీసులతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
asking bleaching powder police are beaten at Santabommali in srikakulam
TAGGED:
సంతబొమ్మాలి వార్తులు