ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు - గుజరాత్​లో ఉత్తరాంధ్ర మత్స్యకారులు

లాక్‌డౌన్‌తో గుజరాత్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు..ఎట్టకేలకు విముక్తి లభించింది. సుమారు 4 వేల మందికి పైగా మత్స్యకారులు...రాష్ట్రానికి చేరుకోనున్నారు. ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు జరిపిన గుజరాత్ ప్రభుత్వం..నెగిటివ్ వచ్చిన వారినే ప్రయాణానికి అనుమతించినట్లు వెల్లడించింది.

fishermans in gujarat
fishermans in gujarat

By

Published : Apr 28, 2020, 11:20 PM IST

Updated : Apr 29, 2020, 2:01 PM IST

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు

లాక్‌డౌన్‌తో గుజరాత్‌ వేరావల్‌లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు... స్వస్థలాలకు మంగళవారం బయల్దేరారు. దుర్భర పరిస్థితుల మధ్య జీవనం గడిపిన దాదాపు 4 వేల 350 మంది ఏపీ, గుజరాత్, కేంద్రం సమన్వయంతో ఊపిరి పీల్చుకున్నారు. వారిని అక్కడి నుంచి పంపేందుకు గుజరాత్ ప్రభుత్వం 64 బస్సులను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర భాజపా సైతం కొన్ని బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మార్గ మధ్యలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రతి బస్సులోనూ ఒక ఇన్‌ఛార్జిని పంపారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల తరలింపు కోసం మూడు కోట్ల రూపాయలను కేటాయించింది. వారిని రాష్ట్రానికి తరలించడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు

కేంద్రమంత్రి సాయం

తీరంలోని జెట్టీలో ఉంటున్న మత్స్యకారులను... చిన్న చిన్న బృందాలుగా విభజించి దగ్గర్లోని ఓ కళాశాలకు తరలించారు. అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వారి పేర్లు, ఆధార్ వివరాలు వంటి సమాచారం నమోదు చేసుకున్న తర్వాత కేటాయించిన బస్సు సమాచారం అందించారు. వీరి ప్రయాణానికి సీట్ కమ్ స్లీపర్ సౌకర్యం ఉన్న బస్సులనే ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాల మధ్య సమన్వయం చేసి వారిని స్వస్థలాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండ్రోజులకు సరిపడా ఆహారాన్ని వారితో పంపుతున్నట్లు చెప్పారు.

క్వారంటైన్ కేంద్రాలకు..

వీరి కష్టాలను కళ్లకు కడుతూ బోట్లలో జాలర్ల పాట్లు ఆకలే ఆవాసం, చావుతో సావాసం శీర్షికలతో ఈనాడు కథనాలు ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహా గుజరాత్ ప్రభుత్వాన్ని సంప్రదించి మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. మత్స్యకారులంతా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత వీరిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.

ఇదీ చదవండి

'రాజ్​భవన్ సిబ్బంది నలుగురికి కరోనా'

Last Updated : Apr 29, 2020, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details