ఐసీడీఎస్ పీవో తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తల ర్యాలీ - srikakulam
ఐసీడీఎస్ పీవో తీరు సరిగా లేదని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో బిల్లుల చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఐసీడీఎస్ పీవో తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పోపుల బిల్లులు, కూరగాయల బిల్లుల చెల్లింపులో కోత విధిస్తున్నారని, గ్యాస్ సిలెండర్ లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. నెలవారీ సమావేశాలు నిర్వహించటం లేదని, కేంద్రాల అద్దెలు సైతం చెల్లించటం లేదన్నారు. పీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు.