'ముగ్గురు మోదీల కుట్ర'
రాష్ట్రాభివృద్ధిని ముగ్గురు మోదీలు అడ్డుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు
మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.12.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని ముగ్గురు మోదీలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.