శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కురిగాం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు భాగ్యశ్రీ(9), సిద్ధు(2) మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా...కొత్తూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని సీతాపురంలో జరిగే పుట్టినరోజు వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆటో, ట్రాక్టర్ ఢీ.. ఇద్దరు చిన్నారులు మృతి - ఆటో, ట్రాక్టర్ ఢీ..ఇద్దరు చిన్నారులు మృతి న్యూస్
ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కురిగాం వద్ద జరిగింది.
ఆటో, ట్రాక్టర్ ఢీ..ఇద్దరు చిన్నారులు మృతి