శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలనుకలెక్టర్ జే. నివాస్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి పక్క ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్ఠాత్మకంగా పేదలకు ఇల్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రతి పేదవాడికి అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. పేదలకు పంపిణీకి పట్టాలు సిద్ధం చేయాలని తహసీల్దార్ లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ తహసీల్దార్ శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖ అధికారులు ఉన్నారు.
ఆమదాలవలసలో ఇళ్ల స్థలాలు పరిశీలించిన కలెక్టర్ - amdalavalsa news
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వంజంగి గ్రామంలో కలెక్టర్ జే. నివాస్ పర్యటించి పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలు పరిశీలించారు.
ఆమదాలవలసలో ఇళ్ళ స్థలాలు పరిశీలించిన కలెక్టర్