ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను జయించిన 86 ఏళ్ల వృద్ధుడు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారినపడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. వృద్ధులపై వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, క్రమంత ప్పకుండా వ్యాయామం చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చని నిరూపించారు 86 ఏళ్ల వృద్ధుడు. కొవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగివచ్చారు.

కరోనాను జయించిన 86 ఏళ్ల వృద్ధుడు
కరోనాను జయించిన 86 ఏళ్ల వృద్ధుడు

By

Published : Aug 12, 2020, 11:56 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిళ్ళాం గ్రామానికి చెందిన తమిరి జనార్దన్ రావు స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 86 ఏళ్ల వయసున్న ఆయనకు ఇటీవల కరోనా సోకింది. జనార్దన్ రావును శ్రీకాకుళం సమీపంలోని జెమ్స్ కొవిడ్ కేర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ 9 రోజుల పాటు కరోనా చికిత్స పొందిన జనార్దన్ రావు వ్యాధిని జయించారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన్ను ఇంటికి పంపారు వైద్యులు. తన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయమం చేయటం వల్లే అతి తక్కువ సమయంలోనే కరోనా నుంచి కోలుకున్నానని జనార్దన్ రావు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details