ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్యుతాపురంలో పునాదుల్లో బయటపడ్డ 11 పురాతన నాణేలు - అచ్చుతాపురంలో పురాతన నాణాలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల అచ్యుతాపురం గ్రామంలో.. 11 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులకు పంపిచినట్లు తహసీల్దార్ తెలిపారు.

11 ancient coins  found in  Achuthapuram
11 పురాతన నాణాలు

By

Published : May 20, 2020, 10:24 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల అచ్యుతాపురం గ్రామంలో 11 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. మజ్జి భుజంగరావు అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతుండగా ఈ నాణేలను గుర్తించారు.

వాటిని తహసీల్దార్ ఎం.కాళీ ప్రసాద్​కు అప్పగించారు. నాణేలపై ఉర్దూ భాషలో అక్షరాలు ఉన్నాయని తహసీల్దార్ చెప్పారు. వాటిని పురావస్తు శాఖ అధికారులకు పంపిచినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details