Bike Racing on National Highway: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రతిష్టాత్మక బాబయ్య స్వామి దర్గా కు అతి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై, స్థానిక యువకుల బైక్ రేసింగ్ విన్యాసాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బాబయ్య స్వామి దర్గా 750వ గంధం మహోత్సవాలు ఇటీవల అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. దర్గాను దర్శించుకుందామనే భక్తులకు జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ప్రమాదకరంగా చేస్తున్న బైక్ రేసింగ్తో, ప్రయాణికులు అగచాట్లకు గురవుతున్నారు. బైక్ రేసింగ్ చేస్తున్న యువకులు.. అందుకు సంబందించిన తమ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. స్థానికంగా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే బైక్ రేసింగ్ లు జరుగుతున్నాయని యాత్రికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.
ఏ బిడ్డా ఇది నా అడ్డ: ఎన్హెచ్ 44 పై వాహనదారులను భయపెడుతున్న ఆకతాయిల బైక్ రేసింగ్
Bike Racing on National Highway: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. 44వ జాతీయ రహదారిపై బైక్ రేసింగ్‌లు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాలల్లో వైరల్ అవుతున్నాయి. హైవేపై పోలీసుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారని వాహదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
44వ జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ఆకతాయిలు బైక్ రేసింగ్