Water Problem In Anantapur : వేసవి కాలం రాకముందే ప్రజలకు దాహం సెగలు తగులుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వందల గ్రామాల వారు నీటి ఎద్దడి వల్ల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇంటి పనులకు, వంట పనులకు, పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు సమస్యగా ఉందని వాపోతున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అనంతపురం జిల్లాలోని వందల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. శ్రీరామిరెడ్డి పథకం ద్వారా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మడకశిర, పరిగి ప్రాంతాల్లోని.. సుమారు 200 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు.
గుడిబండ మండలంలోని పంపుహౌస్‌లో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురికావడంతో ఆయా గ్రామాలకు రెండు వారాల నుంచి నీరు రావడం లేదు. ఫలితంగా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఊరి బయట ఉన్న పొలాల వద్దకు వెళ్లి నీళ్లను తెచ్చుకోవాల్సి వస్తోంది. డబ్బులు పెట్టి ట్యాంకర్లతోనూ నీటి కొనుగోలు చేస్తున్నారు. నీళ్ల సమస్య కారణంగా.. స్కూళ్లకు సెలవు పెట్టాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులుమండిపడుతున్నారు.
గత ప్రభుత్వాలు త్రాగునీటి సమస్య తీర్చేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మడకశిర మరియు హిందూపురం ప్రాంతాలకు నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి త్రాగునీటి పథకంతొ వందల గ్రామాలకు త్రాగునీరు అందించారు. ప్రస్తుతం గుడిబండ మండలం కేకాతి గ్రామంలోని పంప్ హౌస్ వద్ద విద్యుత్ నియంత్రిక మరమ్మతుకు గురి కావడంతో సుమారు 200 గ్రామాలకు త్రాగు నీటి సరఫరా నిలిచిపోయింది. నెలలు గడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
త్రాగునీటి కోసం ఊరి బయట ఉన్న పొలాల వద్దకు చేతకాని వృద్దులు, పిల్లలు వెళుతున్నారు. డబ్బులు పెట్టి ట్యాంకర్ కొనుగోలు చేస్తున్నారు. నీటి సమస్యతో పలుమార్లు పాఠశాలలకు వెళ్లలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రికను ఏర్పాటు చేయడంలో అధికారులు జాప్యంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని గ్రామాల ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.