Bears In Temple: సత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన ఎలుగుబంట్లలో.. ఓ ఎలుగుబంటి గుడి గంటకు వేలాడుతున్న తాడును నోట్లో కరుచుకొని.. ముందు కాళ్లతో లాగి గంటను మోగించింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు తరచూగా వస్తుంటాయని.. ఇప్పటి వరకు ఎవరికి ఏ హాని తలపెట్టలేదని ఆలయ అర్చకులు అంటున్నారు.
గుడిలో గంట మోగించిన ఎలుగుబంటి.. వైరల్ అవుతున్న వీడియో.. - bears temple bell
Bears In Temple: రాత్రి సమయంలో రెండు ఎలుగుబంట్లు గుడిలోకి ప్రవేశించాయి. రెండు ఎలుగుబంట్లలో ఓ ఎలుగు బంటి ఆలయంలో ఉన్న గంటను మోగించింది. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంతకీ ఇది ఎక్కడంటే..
Etv Bharat