TDP PROTEST: పంటల బీమా పంపిణీలో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయ ముట్టడి కార్యక్రమాలను తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించారు. కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని దేవరచెరువు వద్ద నుంచి ప్రారంభమెన ఈ ప్రదర్శనలో వందలాది ట్రాక్టర్లతో తెదేపా నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 42వ జాతీయ రహదారి మీదుగా సాగిన ప్రదర్శన హిందూపురం రోడ్డునుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది.
TDP PROTEST: పంటల బీమా కోసం తెదేపా నిరసన.. కదిరిలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
TDP PROTEST: పంటల బీమాలో రైతులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో తెదేపా నాయకులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. అన్నదాతను వైకాపా ప్రభుత్వం అన్నివిధాలగా మోసగిస్తోందని తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
TDP PROTEST
ముఖ్యమంత్రి జగన్ అన్నదాతల నడ్డి విరుస్తున్నారని తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. నష్టపోయిన రైతులందరికీ బీమా వర్తింపచేయాలని డిమాండు చేశారు. పంటలబీమా వర్తింపు, బిందు సేద్యంలో రాయితీలు ఎత్తివేయడం వంటి రైతు వ్యతిరేక విధానాలపైన తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో రాఘవేంద్రకు వినతిపత్రం అందజేేశారు.
ఇవీ చదవండి: