ఎమ్మెల్సీ పోతుల సునీత, వైకాపా నేతలు కరణం వెంకటేష్, అమృతపాణి ఆధ్వర్యంలో చీరాల గడియారస్తంభం కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. నేతలు ర్యాలీ చేశారు. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసునని కరణం వెంకటేష్ అన్నారు.
చీరాలలో వైకాపా నేతల ర్యాలీ - chirala ysrcp leaders war news
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో కార్యక్రమాలు చేపట్టారు. అడుగడుగునా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ysrcp leaders rally in chirala prakasham district
చీరాల నుంచి ఈపురుపాలెం వరకు జగన్ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట నుంచి చీరాల వరకు నేతలు ర్యాలీ నిర్వహించారు. పేద ప్రజల అభ్యున్నతికోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆమంచి అన్నారు.
Last Updated : Nov 6, 2020, 4:58 PM IST