ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీ కామాక్షి కేర్ ఆసుపత్రి ఎండీ తడివలస దేవరాజు 500 బెడ్ షీట్లను వైకాపా నేత కరణం వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు. ప్రైవేటు ఆసుపత్రి ఎండీ ప్రభుత్వాసుపత్రికి సహాయం చేయటం శుభపరిణామం అని వెంకటేశ్ అన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించవచ్చని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
'దాతల సహకారముంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యం' - latest news in prakasam district
ప్రభుత్వ వైద్యశాలకు ప్రభుత్వంతో పాటు దాతల సహకారం ఉంటే... మరింత మెరుగైన వైద్యం అందించవచ్చని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్ అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి ఉచిత బెడ్ షీట్స్