ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చినుకుపడితే చాలు... చెరువులను తలపిస్తున్న రోడ్లు

యర్రగొండపాలెంలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. చినుకు పడితే చాలు దారులన్నీ  నీటితో నిండిపోతున్నాయి.

రోడ్ల దుస్థితి

By

Published : Aug 3, 2019, 10:44 AM IST

చినుకుపడితే చాలు... రోడ్లపై గంతులే...

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వర్షం వస్తే విధుల్లోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చిన్న జల్లు పడినా రహదారులన్నీ చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. వర్షం నీరు పారేందుకు సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవటంతో సమస్య ఏర్పడింది. కొత్త రోడ్లు నిర్మించినా.. వాటికి ఇరువైపుల మురుగు కాలువల ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ నీరు అక్కడే నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. వస్తాద్ గారి బజార్, స్టేట్ బ్యాంక్ పక్క విధి, పెద్ద మజీద్ బజార్, పడమటవీధి, పాత రిజిస్టర్ కార్యాలయం వీధిలో ఇదే పరిస్థితి. వాహనదారులు, పాదచారులు నీళ్ళలోనుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details