ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైకాపా నేత మృతి చెందారు. ఒంగోలు చెరువు కొమ్ముపాలెం సమీపంలో జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టంగుటూరు సొసైటీ అధ్యక్షుడు, మండల వైకాపా నాయకులు రావూరి అయ్య వారయ్య మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. కానీ అప్పటికే అయ్య వారయ్య తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారు.
ఒంగోలు రోడ్డు ప్రమాదంలో వైకాపా నేత మృతి - ఒంగోలులో కారు ప్రమాదం
ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువు కొమ్ముపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైకాపా నేత రావూరి అయ్యవారయ్య మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Ycp leader