ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శాంతికి మొక్కలంటే అమితమైన ఇష్టం. పర్యావరణానికి ప్రధాన ఆయువు పట్టు పచ్చదనమని నమ్మే ఆమె తన ఇంటిని రకాల మొక్కలతో నింపేశారు. ఇంటి ఆవరణలో స్థలం తక్కువ ఉన్నా ప్రణాళికా బద్దంగా క్రోటన్సు, బోన్సాయ్ చెట్లు, అడీనియ్స్ రకాలు.. ఇలా సుమారు వంద రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. ఇంటి ఆవరణలోనే కాకుండా, పార్కుల్లో, తహసీల్దారు కార్యాలయ ఆవరణల్లో కూడా శాంతి మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు.. సామాజిక బాధత్యగా ఇంట్లో సాధ్యమైనంత వరకూ ప్లాస్టిక్ వినియోగంలేకుండా చూసుకుంటారు.. గుడ్డ సంచులను కుట్టించి ప్రజలకు పంచి పెడుతుంటారు. చెక్క పెట్టెలు, పాత తరం వస్తువులనే ఎక్కువుగా వినియోగిస్తారు. వంటగది వ్యర్థ పదార్థాలతో ఎరువును తయారు చేసి మొక్కలను వినియోగిస్తారు. ఎక్కడైనా మొక్కలు పెంచేవారు, చెట్లను సంరక్షించేవారు ఉంటే అక్కడకు వెళ్లి వారి సలహాలు తీసుకోవడం ఆమె ఆనవాయితి. శాంతి చేపట్టే కార్యక్రమాలకు, అభిరుచిని కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సాహిస్తుంటారు. భర్త గోవర్థన్ వ్యాపార వేత్త అయినా, కొంత సమయం భార్యకు చేపట్టే మొక్కలు సంరక్షణ కార్యక్రమానికి భాగస్వామ్యులవుతారు.