సాగర్ కాలువలో మహిళ మృతదేహం లభ్యం
ప్రకాశం జిల్లా చంద్రపాలెం సమీపంలో సాగర్ కాలువలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాదవశాత్తు కాలువలో పడిందా..? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
సాగర్ కాలువలో మహిళ మృతదేహం
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చంద్రపాలెం సమీపంలో సాగర్ కాలువలో నాయుడుపాలెంకు చెందిన నాగమణి(27) అనే మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా వారు దర్యాప్తు చేపట్టారు. వివాహితురాలైనా నాగమణికి తన భర్తతో మంగళవారం రాత్రి గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాదవశాత్తు కాలువలో పడిందా..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.