ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్యం బాగోలేదని... ఆయువు తీసుకుంది! - suicide latest news update

ప్రకాశం జిల్లా వేటపాలెంలో పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Woman committing suicide
మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

By

Published : Jun 20, 2020, 12:14 AM IST

అనారోగ్యం కారణంగా మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన శేషారత్నం(55) అనే మహిళ... మధుమేహంతో పాటు పలు వ్యాధులతో బాధ పడుతోంది. వైద్యశాలలో చికిత్స తీసుకున్నప్పటికీ రోగాలు నయం కాకపోవటంతో మనస్థాపానికి గురైన ఆమె... పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేషారత్నం మృతి చెందింది. ఈమె గతంలోనూ ఓసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details