నీటి కొరతతో అల్లాడే ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల కష్టాలు.. వేసవి రాకతో తీవ్రమయ్యాయి. పొదిలి మండలంలో తాగునీటికి ప్రజలు కటకటలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలో దాదాపు 20 పంచాయతీల ప్రజలను నీటి కొరత వేధిస్తోంది. రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటుచేసి దశాబ్దాలు గడవగా.. నిర్వహణ సక్రమంగా లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సాగర్ కాలువ నుంచి కొన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్న నీరు.. శుద్ధి చేయకుండా నేరుగా పంపింగ్ చేస్తున్నందున రోగాల పాలవుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
నీటికొరతకు తాళలేక వలస..
గ్రామాల్లో ఎక్కడ చూసినా భూమి తడారిపోయిన పరిస్థితులే ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగింటిపోగా.. ఆరేడు వందల అడుగుల లోతుకు తవ్వినా నీరు పడని పరిస్థితులున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామాలకు రెండుమూడు కిలోమీటర్ల దూరంలో డీప్ బోర్లు వేసి, అక్కడి నుంచి ట్యాంకుల ద్వారా ఎలాగో నీరు సరఫరా చేస్తున్నారు. అదీ 3 రోజులకోసారి మాత్రమే వస్తున్నందున.. ప్రజల అవసరాలు తీరడంలేదు. ట్యాంకుల ద్వారా వచ్చే అంతంతమాత్రం నీటినే తాగడానికి, కాలకృత్యాలకు వినియోగించుకుని.. పశువులకూ వాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నీటికొరతకు తాళలేక పలు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
లక్షల రూపాయల బిల్లులు బకాయిలు..