దవాఖానాలో దాహం దాహం.. రోగుల ఇక్కట్లు - water problems
ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోంది. గుక్కెడు నీరు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.
ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రభుత్వాసుపత్రిలో తాగునీరు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగానికి రోజు వందలాది మంది రోగులు వైద్య సాయం కోసం వస్తుంటారు. ప్రభుత్వాసుపత్రికి దాతలు సహృదయంతో మంచినీటి శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో అది మనుగడలో లేకుండా పోయింది. నీళ్లు కావాలంటే రోగులు బయట డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితి దాపరించింది. దాతలు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఉపయోగించకుండా మూలన పడేశారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.