ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చలివేంద్రానికి దాహం... అది మంత్రిగారి నియోజకవర్గం

ఆ ఊరి పేరు చలివేంద్రం. కానీ అక్కడ లేనిది అదే. కనీసం అక్కడి ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా... వారి బతుకులు మారలేదు. ఆ ఒక్క గ్రామంలోనే కాదు... దర్శి నియోజకవర్గంలోని పలు ఊర్లలోనూ పరిస్థితి నెలకొంది.

By

Published : May 12, 2019, 7:15 PM IST

మంత్రి ఇలాకాలో కరవు... చలివేంద్రానికి దాహం

నియోజకవర్గ కేంద్రం దర్శి మండలంలోని చలివేంద్రం ప్రజలు... 15 ఏళ్లుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామం దర్శికి 5 కిలోమిటర్ల దూరంలో ఉంది. పల్లెలో మొత్తం 65 నుంచి 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. నీటి సమస్యే కాదు... ఆ పల్లెలో కనీస వసతుల కల్పన అంతంత మాత్రమే! అంతర్గత రహదారులపై తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవు. ఏ వీధిలో చూసినా దుర్గంధమే..1

చలివేంద్రంలో నీళ్లట్యాంకులు, చేతిపంపులు అలంకారప్రాయంగా మిగిలాయి. ఈ పల్లెవాసులు నీళ్లు తెచ్చుకోవాలంటే... ఇతర ప్రాంతానికి వెళ్లాల్సిందే. నేతలు ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు అడుగుతారే తప్ప... తరువాత కన్నెత్తి చూడరని బాధితులు దీనంగా చెబుతున్నారు. అటు అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యమని వాపోతున్నారు.

దర్శి నియోజకవర్గంలోని 5మండలాల పరిధిలో.. 144 గ్రామాలకు మంచినీరు అందించేందుకు... నెదర్లాండ్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఎన్​ఏపీ చెరువు సుదూరంలో ఉంది. అక్కడి నుంచి తమ ప్రాంతానికి నీరు అందేలా.. కొంచెం దృష్టిసారిస్తే అసలు సమస్యే ఉండదని చలివేంద్రం వాసులు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో నీటి పాట్లు తప్పడంలేదని... ప్రభుత్వం స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

మంత్రి ఇలాకాలో కరవు... చలివేంద్రానికి దాహం

ఇదీ చదవండి...

భానుడి భగభగలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details