మద్యం అక్రమ విక్రయదారులపై ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు కొరడా ఝళిపించారు. కరోనా కట్టడి చర్యలను ఆసరాగా తీసుకుని మద్యం వ్యాపారం జోరుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది.
అక్రమంగా పెద్ద ఎత్తున మద్యం సీసాలను నిల్వచేసిన వారిగుట్టును పోలీసులు రట్టు చేశారు. వేటపాలెం మండలం నాయనపల్లి, పందిళ్లపల్లిలో ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా.. పలు దుకాణాల్లో 306 సీసాలను పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.