హత్య కేసు నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చెసి, సామగ్రి తగలబెట్టిన ఘటన ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలోని రాజానగరంలో జరిగింది. ఆగస్టు 23న సుబ్బారెడ్డి అనే వ్యక్తి హత్య జరిగింది. అదే గ్రామానికి చెందిన కె.వెంకటేశ్వర్లు ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు రిమాండ్లో ఉండగా.. కుటుంబ సభ్యులు అదే మండలంలోని మాధవరంలో తలదాచుకున్నారు.
నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు - హత్య కేసు నిందుతుడు తాజా వార్తలు
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలోని రాజానగరంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటిని ధ్వంసం చేసి, సామగ్రి తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేశారు.
నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
నిందితుని ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి, లోపలికి వెళ్ళి ఇంటిలో ఉన్న సామానులు బయట పడేసి నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే వస్తువులు చాలావరకు కాలిపోయాయి. ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని ఎస్సై నాగరాజు తెలిపారు.
ఇవీ చూడండి...