ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం శింగరకొండ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయాన్ని తితిదే ఛైర్మన్ దంపతులు వైవీ.సుబ్బారెడ్డి, స్వర్ణమ్మ సందర్శించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా గోమాతను సమర్పించి.. పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ బాచిన కృష్ణచైతన్య, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఛైర్మన్ జువ్వి రాము, ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.