ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కోణిదెన గ్రామ సమీపంలో 12వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన మేరకు బ్రహ్మగుండం సమీపంలో కొండపైన 12వ శతాబ్దం శాలివాహన శకం నాటి వరద మల్లయ స్వామి దేవాలయం ఉంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా కొందరు యువకులు గుడిలో పూజలు చేసేందుకు కొండపైకి వెళ్లారు. ఆలయం పగలకొట్టి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. పురాతన దేవాలయం కావటంతో గుప్త నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేసి ఉంటారని పులువురు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యు అధికారి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పురాతన దేవాలయం ధ్వంసం... గుప్త నిధుల కోసమేనా..!
ప్రకాశం జిల్లా బల్లికురవ కోణిదెన గ్రామ సమీపంలో 12వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ప్రకాశం జిల్లా గుప్త నిధులకోసం దేవాలయం ధ్వంసం