ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణ...ముగ్గురికి గాయాలు

పాత కక్ష్యలతో ఇరువర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో ముగ్గురు గాయపడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

పాత కక్ష్యలతో ఇరు వర్గాల ఘర్షణ

By

Published : Sep 12, 2019, 2:40 PM IST

పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణ
ప్రకాశం జిల్లా కురుచేడు మండలం బయ్యారం గ్రామంలో బొల్లెపల్లి శ్రీనివాసరావు, బొల్లెపల్లి ఆదినారాయణలకు ఉన్న పాత కక్షలతో ఘర్షణ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగటంతో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఘర్షణలో గాయపడినవారిని గ్రామస్థులు దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మోహన్​రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసరావు వేరేవాళ్లకు అమ్మిన పొలంలో ఆదినారాయణ గడ్డి పెంచడమే వివాదానికి దారి తీసిందని తెలిపారు. ఈ విషయంపై మాలెంపాటి ఆంజనేయులనే వ్యక్తి కుమారుడుపై ఫిర్యాదు చేశారని... ఆయన ఫీల్డ్​ అసిస్టెంట్ ఉద్యోగం పోయిందని వివరించారు. దీన్ని మనసులో పెట్టుకొని శ్రీనివాసురావుపై దాడి చేశారని చెప్పారు. ఘర్షణలో పాల్గొన్న శ్రీనివాసరావును, ఎసయ్యను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details